కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నిరసన ర్యాలీ
పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను ఖండిస్తూ సింగరాయకొండలో జనసేన అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జనసేన ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు మానవహారంగా ఏర్పడి ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, కొండపి జనసేన ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.