రాయదుర్గం: ప్రధాని వాఖ్యలపై పట్టణంలో గోల్డ్ షాపు లు బంద్, నిరసన ర్యాలీ
ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై స్వర్ణకారులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గోల్డ్ షాపులు బంద్ చేసి నిరసనలు చేపట్టారు. రాయదుర్గం పట్టణంలో స్వర్ణకారులు ర్యాలీ చేసి వినాయక కూడలిలో నిరసనకు దిగారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అసోషియేషన్ అధ్యక్షులు గోల్డ్ ఘని, కంసల నాగరాజు, ఆరుణ్ బాష, తదితరులు పాల్గొన్నారు.