కొండపి: కొండపిలో మాజీమంత్రి సురేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ, హామీలు నెరవేర్చడంలో కూటమి వైఫల్యం అని విమర్శించిన మాజీ మంత్రి
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు వైఫల్యం చెందారని మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ అన్నారు. శుక్రవారం కొండపిలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదిమూలపు సురేష్ కార్యకర్తలు కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా సక్రమంగా చంద్రబాబు నెరవేర్చలేకపోయారని సురేష్ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు.