గిద్దలూరు: గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు నీటి బొరును వేయించిన అటవీశాఖ అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలోని ఓబులాపురం తండా గ్రామ ప్రజల నీటి సమస్యను అటవీ శాఖ అధికారులు పరిష్కరించారు. కొద్దిరోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి అటవీ శాఖ నిధులతో మంచినీటి బోరు వేయించారు. శుక్రవారం మంచినీటి బోరును ప్రారంభించడంతో స్థానిక గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అటవీశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.