రాయదుర్గం: మంత్రి జనార్ధన్ రెడ్డి ని కలిసి మంతనాలు జరిపిన వైఎస్సార్సీపీ ముఖ్య నేత గౌని ఉపేంద్రారెడ్డి
YSRCP స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డిని కలిశారు. వైసిపి ముఖ్య నేత మంత్రి ని కలవడం రాయదుర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఉపేంద్రారెడ్డి తో పాటు, మాజీ MPP నాగరాజు రెడ్డి మరి కొందరు ఆ పార్టీ నాయకులు శనివారం రాత్రి రాయదుర్గం మండలంలోని పల్లేపల్లి గ్రామంలోని మాజీ MLA దివంగత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి నివాసంలో మంత్రితో బేటీ అయి మంతనాలు జరిపాంచారు. ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డికి, ఉపేంద్రారెడ్డి కి మద్య దూరం పెరిగింది.