తాడిపత్రి: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
తాడిపత్రిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అందరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.