గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో 8 గంటలకు పైగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో దాదాపు 8 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు శనివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య తలెత్తగా కొందరి మొబైల్ ఫోన్లలో చార్జింగ్ అయిపోయి అవస్థలు పడ్డారు. మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడు కూడా పట్టణంలో ఎంత మొత్తంలో విద్యుత్ నిలిచిపోయిన సందర్భాలు లేవని ప్రజలు తెలిపారు.