విశాఖపట్నం: నిమజ్జన ప్రాంతాల్లో జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
విశాఖపట్నం నేవల్ కోస్టల్ బ్యాటరీ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. నిమజ్జనం తర్వాత వ్యర్థాలను త్వరగా తొలగించాలని, పారిశుధ్యం, భద్రత, విద్యుత్ దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.