రాయదుర్గం: కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా అభ్యసన తరగతులు ప్రారంభం
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాభివృద్ధి కోసం రాయదుర్గం కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో యోగా అభ్యసన తరగతులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కళాశాల ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, వ్యాయామ విద్య విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తరగతులను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సహదేవుడు తెలిపారు. యోగా శిక్షకులు మల్లికార్జున ప్రాణాయామం, ధ్యాన పద్ధతులను విద్యార్థులకు నేర్పిస్తూ, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంత లభిస్తాయని తెలిపారు.