ఉరవకొండ: ఉరవకొండలో జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు
ఉరవకొండలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రాము, మధు ప్రసాద్ తదితరులు ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఫెర్రర్ ప్రజలకు చేసిన సేవలను, అభివృద్ధిని గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.