తాడిపత్రి: తాడిపత్రి లోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సపోటా పండ్లతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ
తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు యోగానంద శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి సపోటా పండ్లతో వినూత్నంగా, ప్రత్యేకంగా అలంకరించారు. ప్రకృతి ప్రసాదాలతో స్వామివారిని అలంకరించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.