గిద్దలూరు: రాచర్ల సెక్షన్ అటవీ ప్రాంతంలోని అర్ధవీడు మండలంలో అటవీశాఖ అధికారులు గుప్తనిధుల తవ్వకాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
మార్కాపురం జిల్లా రాచర్ల సెక్షన్ నల్లమల అటవీ ప్రాంతంలోని అర్ధవీడు మండలంలో అటవీశాఖ అధికారులు గుప్తనిధుల తవ్వకాలు జరిపారని పుకార్లు వ్యాప్తి చెందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు, పురావస్తు అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. విజయవాడ, నెల్లూరు నుంచి వచ్చిన పురావస్తు అధికారులు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం బుగత్ శీల కాలంనాటి ప్రజలు ఉపయోగించిన మట్టి పాత్రలని తేల్చి చెప్పారు.