మార్కాపురం: తర్లపాడు మండల కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్లో పల్స్ పోలియో డ్రాప్స్ వేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని పిహెచ్సి సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... జిల్లాలో లక్ష ఎనిమిది వేల మంది చిన్నారులు ఉన్నారని వారందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు.