దర్శి: బెట్టింగ్ రాయుళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో బెట్టింగ్ రాయలకు డీఎస్పీ లక్ష్మీనారాయణ ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. దానివల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బెట్టింగ్కు పాల్పడుతున్న ఆరు మందిని అరెస్ట్ చేశామన్నారు. 22 మందికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. బెట్టింగ్ వల్ల నష్టమే తప్ప లాభం వచ్చింది లేదని అలాంటి వ్యసనాన్ని మానుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు.