గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో నిలిచిపోయిన ట్రాఫిక్, అవస్థలు పడుతున్న వాహనదారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. చీమకుర్తి నుండి తాడిపత్రి కి గ్రానైట్ భారీ బండరాయితో వెళ్తున్న లారీ ట్రాక్ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో నంద్యాల గిద్దలూరు మార్గాల మధ్య రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న నంద్యాల, గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.