మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆటిజం సెంటర్ భవన నిర్మాణం
మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆటిజం సెంటర్ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఆటిజం వల్ల పిల్లలు ఇతరులతో సరిగ్గా మాట్లాడలేకపోవడం భావాలను పంచుకోవడంలో ఇబ్బంది పడడం ఒకే రకమైన ప్రవర్తనను పదే పదే ప్రదర్శించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష నుండి 42 లక్షల రూపాయల నిధులతో నిర్మాణానికి మే ఒకటో తేదీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.