కొండపి: సింగరాయకొండ మండలంలో అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా ఎస్ఐ మహేంద్ర సోమవారం తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇప్పటికే కేసు దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్న నేపథ్యంలో కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.