దర్శి: బాటిల్స్ క్యాన్లకు పెట్రోల్ డీజిల్ ఇవ్వొద్దని హెచ్చరించిన ఎస్సై మల్లికార్జున రావు
Darsi, Prakasam | Apr 28, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులను ఎస్ఐ మల్లికార్జునరావు తనిఖీలు చేశారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. అధికంగా ఆయిల్ తీసుకువెళ్లడంతో కొరత ఏర్పడుతుందన్నారు. బాటిల్స్ క్యాన్లకు ఇంధనం ఇవ్వవద్దని సూచించారు. ధరలు పెంచిన బ్లాక్ మార్కెట్కు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.