రాయదుర్గం: నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, దార్మిక, ఆధ్యాత్మిక సంస్థల కార్యాల వద్ద యోగాసనాలు చేశారు. యోగాతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పొందవచ్చని యోగా నిపుణులు ఈ సందర్భంగా వివరించారు. కణేకల్లు, బొమ్మనహాల్, డి.హిరేహాల్, గుమ్మగట్ట మండల కేంద్రాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా జరిపాంచారు. విద్యార్థులు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.