రాయదుర్గం: రైతులను ధగా చేస్తే సహించే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
రైతులను దగా చేసి మోసం చేస్తే సహించే ప్రసక్తే లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాయదుర్గంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయదుర్గం కూరగాయల మార్కెట్ లో నిబంధనలకు విరుద్ధంగా రుసుం వసూలు చేసి రైతుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల జవసత్వాలు కోల్పోయి పనిచేస్తున్నారని విమర్శించారు. వచ్చే సోమవారం నుండి వారధి పేరుతో ప్రజల సమస్యల తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాడుతామని ప్రకటించారు. BJP నాయకులు జివి నాయుడు, వన్నూరస్వామి, సిద్ధప్ప పాల్గొన్నారు.