రాయదుర్గం: మహిళలు, బాలబాలికల రక్షణ అందరి బాధ్యత : డిఎస్పీ రవిబాబు, సిఐ వెంకటరమణ
బాలికలు, మహిళల రక్షణ అందరి బాధ్యత అని డిఎస్పీ రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ అన్నారు. కణేకల్లు లో బాలికలు మహిళల బద్రతపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక సంఘటన ఉదహరించారు. చిన్నపల్లలు సెల్ ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనించాలని కోరారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనానికి యువత బానిస కావద్దని సూచించారు. శక్తి యాప్ వినియోగంతో మహిళలకు పోలీసు శాఖ రక్షణ గా ఉంటుందన్నారు. ఎస్ఐ నాగమధు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.