మార్కాపురం: జిల్లా కేంద్రంలోని తోట బజారులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం తోట బజారులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... తడి పొడి విషపూరిత చెత్త ఎంత ప్రమాదకరమో ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకొని తడి పొడి చెత్తను విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు.