గిద్దలూరు: అర్ధవీడు మండలంలో మహిళ అవమాన భారంతో ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో ఓ మహిళ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. కాలకృత్యాలకు తీర్చుకునేందుకు వెళ్లిన సమయంలో కొందరు కామెంట్ చేయగా ఆ విషయాన్ని మహిళ ఇంట్లో చెప్పింది. ఇంట్లో వాళ్ళు మందలించడంతో అవమానంగా భావించిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాగిన క్రమంలో ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.