గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు, మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించడం పై హర్షం
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. నేడు అయిదు రాష్ట్రాలలో విడుదలైన ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధించడం పై నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ బానసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని బిజెపి నాయకులు ఈ సందర్భంగా అన్నారు.