మార్కాపురం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో కరెంట్ తీగలు తగిలి రైతు చంద్రశేఖర్ రెడ్డి మృతి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో కరెంటు తీగలు తగిలి రైతు చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. తన పొలంలోని మిర్చి కళ్ళల్లో ఉన్న ఇనుప నీటి పైపులను పక్కకు తొలగించే క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.