రాయదుర్గం: 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసిన డి.హిరేహాల్ పోలీసులు
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా కర్నాటక కు తరలిస్తున్న టెంపో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని డి.హిరేహాల్ పోలీసులు సీజ్ చేశారు. డి.హిరేహాల్ మండలం మడేనహళ్లి క్రాస్ వద్ద పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. చెల్లికెర వైపు పోతున్న మహేంద్ర టెంపో వాహనాన్ని ఆపి చెక్ చేయగా అందులో 50 కిలోల లతో కూడిన 30 బస్తాల పిడిఎస్ రైస్ ను గుర్తించారు. బళ్లారి పట్టణానికి చెందిన పుల్లన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.