కొండపి: సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వివరాలను వెల్లడించిన రైల్వే పోలీసులు
ప్రకాశం(D) సింగరాయకొండలో మంగళవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతుడి వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా.. అతను నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని RVకండ్రికకు చెందిన K.హరికృష్ణ (31) భార్య ఫణిత (30), పిల్లలు కృష్ణ కిరీటి (4), మన్విత (3)గా గుర్తించారు. వినాయక గుడి సమీపంలో నివసిస్తున్న వారని లైసెన్స్ వివరాలు నమోదై ఉన్నాయి.