గిద్దలూరు: గిద్దలూరు మండలం ముండ్లపాడు సమీపంలో ఆటోని తప్పించే క్రమంలో సిమెంటు లారీ అదుపుతప్పి బోల్తా, డ్రైవర్ కి స్వల్ప గాయాలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం సిమెంట్ రోడ్డుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లుగా డ్రైవర్ వెల్లడించారు. జరిగిన ప్రమాదం పై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.