కొండపి: జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించి జరిమానాలు విధించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ పై పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారుడికి పోలీసులు జరిమానా విధించారు. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. పరిమితికి మించి ఆటోలలో కూలీలను తరలిస్తుండగా ఆటో డ్రైవర్లకు పోలీసులు జరిమానా విధించారు.