కొండపి: జరుగుమల్లి మండలం దావగూడూరు చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా వెంకటసుబ్బయ్య ప్రమాణస్వీకారం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరు లో శ్రీచెన్నకేశవస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. ఆలయ ఛైర్మన్గా వెంకటసుబ్బయ్యతోపాటు మరో 10మంది ధర్మకర్తలుగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా టీడీపీ నాయకుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. జిల్లాలోనే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆలయ అభివృద్ధికి పార్టీ తరపున సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.