రాయదుర్గం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి చికిత్స పొందుతూ మృతి
రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామానికి చెందిన తిప్పేస్వామి అనే రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కౌలు వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్న అతను అప్పుల భారంతో మానసికంగా కుంగిపోయి గత నెల 29 న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.