యర్రగొండపాలెం: భూ వివాదంలో రవికుమార్ ను హత్య చేసిన ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపిన సిఐ అజయ్ కుమార్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతగోడులో ఈనెల 10వ తేదీ జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ తెలిపారు. వడ్డేశ్వరానికి చెందిన రవికుమార్ ను శతగోడు కు చెందిన చిన్న పోలిరెడ్డి మానేపల్లి కి చెందిన బాబురావు కలిసి 67 ఎకరాల భూమి అమ్మే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తి రవికుమార్ ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు.