కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో అత్యధిక తిరస్కరణలతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు మందగించాయి. గురువారం చిన వెంకన్నపాలెం రైతులు తెచ్చిన 128 బేళ్లలో, కొనుగోలుదారులు కేవలం 67 బేళ్లను మాత్రమే కొని, 61 బేళ్లను తిరస్కరించారు. పోటీతత్వం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం తప్ప, సరైన ధర లభించడం లేదని, ఆందోళన చెందుతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.