మార్కాపురం: మైనార్టీల జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సాదిక్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సాదిక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ నిరుద్యోగ యువత కోసం జూలై 11వ తేదీ విజయవాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్న మైనార్టీ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు.