గిద్దలూరు: కొమరోలు పట్టణంలో పట్టపగలే చోరీ, ఇంటిలోకి ప్రవేశించి బంగారం నగదు ఎత్తుకు వెళ్ళిన దొంగలు
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వీధిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో ఉన్న 10 తులాల బంగారం రూ.1.20 లక్షల నగదు దొంగిలించి తీసుకువెళ్లారు. దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ఓ సీసీ కెమెరాలలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ కదలికలను పోలీసులు గుర్తించారు.