రాయదుర్గం: కళ్యం సమీపంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు
డి.హిరేహాల్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీ సయిబ్ బాస్కీ (21) కళ్యం గ్రామ సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను విద్యుత్ టవర్ నిర్మాణ పనుల వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ షెడ్‌లో ఉంటున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.