మార్కాపురం: పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులో టిప్పర్ ఢీకొని రవికుమార్ మృతి
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రవికుమార్ తన కూతురుని స్కూల్లో చేర్పించి వస్తున్న సమయంలో ట్రాక్టర్ ను తగిలి అదుపుతప్పి వెనక వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.