సంతనూతలపాడు: మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామంలో రెచ్చిపోయిన దొంగలు, ఇంటిలోకి ప్రవేశించి నగదు బంగారాన్ని దొంగిలించిన దొంగలు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెల్లబాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. శేషగిరిరావు అనే వ్యక్తికి చెందిన ఇంటిలో శనివారం దొంగలు చోరీ చేశారు. 20 రోజుల క్రితం వ్యక్తిగత పనుల పై వేరే ప్రాంతానికి వెళ్ళిన శేషగిరిరావు ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించాడు. బీరువా పగలగొట్టి బంగారం నగదు దోచుకు వెళ్లినట్లుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్ ని రంగంలో దించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.