మార్కాపురం: జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులు డిఎ చెల్లించాలని నిరసన
మార్కాపురం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులు సకాలంలో డిఏ చెల్లించాలని నిరసన తెలిపారు. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సలీం మాట్లాడుతూ... న్యాయబద్ధంగా రావాల్సిన ఐడిఏ, ఐడిఆర్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలన్నారు. డిపిఈ పేరా 5 తొలగించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.