రాయదుర్గం: హామీలకు సమాధి, ప్రజలకు వెన్నుపోటు.. టిడిపి రెండేళ్ల పాలనపై YCP నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి
ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్తాం. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదల గొంతుకగా పోరాడతామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. రెండేళ్ల చంద్రబాబు పాలనపై వారు నిప్పులు చెరిగారు. రాయదుర్గంలో సోమవారం "చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.