గిద్దలూరు: గిద్దలూరులో గ్రూపులుగా విడిపోయి.పోటాపోటీగా వైసీపీ నేతలు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహణ
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైసీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారు. బుధవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇన్చార్జి నాగార్జున రెడ్డి ఎర్రగొండపాలెం పరిశీలకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటా పోటీగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పిన నేతలు దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయని అన్నారు. 2029 ఎన్నికలలో మరో మారు జగన్ ని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని నేతలు తెలిపారు.