గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని పలు పాఠశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాఠశాలలు కళాశాలలలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వారు వివరించి చెప్పారు. విద్యార్థులు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో మంటలు అంటుకున్నప్పుడు వాటిని ఎలా అర్పాలో విద్యార్థులకు తెలిపారు.