కొండపి: సింగరాయకొండ పట్టణంలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాల నివారణ పై కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ శ్రీహరి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో గురువారం సీఐ శ్రీహరి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను తరలించరాదని ఆటో నడిపే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఆటో సంబంధిత డాక్యుమెంట్స్ దగ్గర ఉండాలన్నారు. ఆటోలకు అనధికారకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లు తొలగించారు.