దర్శి: దర్శి ప్రజా దర్బార్ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆమెకు అందజేశారు. అర్జీలను స్వీకరించిన ఆమె వారి సమస్యను స్పష్టంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.