గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో ఈదురు గాలులు తుఫానుకు నేలకొరిగిన 20 పూరి గుడిసెలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయ గుళ్ళ గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు 20 పూరి గుడిసెలు నేలకొరిగాయి. దీంతో 20 కుటుంబాలు నిరాశ్రయులుగా మారినట్లుగా వాపోయారు. బుధవారం వారు తెలిపిన వివరాల మేరకు బలమైన ఈదురు గాలులు తాము ఏర్పరచుకున్న స్థిర నివాసం కుప్పకూలిపోయినట్లుగా వాపోయారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు తమవైపు కన్నెత్తి కూడా చూడలేదని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.