గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి కూటమి నాయకుల కార్యకర్తలు భారీగా పాల్గొని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసిపి పాలన రౌడీలు రాజ్యము లేనట్లు ఉండేదని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారని ప్రజలందరూ రాష్ట్రంలో ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే వైసిపి ఓర్చుకోలేకపోతుందని అన్నారు.