కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిరాశ జనకంగా ముగిసిన వేలం, 60 శాతానికి పైగా తిరస్కరణలు జరిగాయని రైతులు ఆవేదన
అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపి పొగాకు వ్యాపారులు తమను పూర్తిగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులల్లో పోటీతత్వం లేకపోవడంతో రోజురోజుకు ధరలు దిగజారుతున్నాయన్నారు. ప్రభుత్వంలోని పాలకులు రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని వేలం కేంద్రాల్లో రైతులకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలని వేడుకుంటున్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో 60 శాతానికి పైగా పొగాకు బేళ్లు ప్రతి రోజు వెనుదిరుగుతున్నాయి.