కొండపి: కొండపి, సింగరాయకొండ ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితిలు, ఎక్కడ కొడతలేదని ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా కొండపి, సింగరాయకొండ ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులకు పెట్రోల్ డీజిల్ లభించడంతో ఉపశమనం పొందారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉందని కలెక్టర్ రాజాబాబు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు.