రాయదుర్గం: డి.హిరేహాల్ లో స్వచ్చత కార్యక్రమాలు చేపట్టిన పంచాయతీ అధికారులు
డీ. హీరేహాళ్ మండల కేంద్రంలో హిర్దేహాల్ గ్రామానికి వెళ్లే దారిలో చెత్త దిబ్బలను పంచాయితీ అధికారులు తొలగించి స్వచ్చత కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం పంచాయతీ సిబ్బంది చెత్తను తొలగించి ట్రాక్టర్ల ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రానికి తరలించారు. MPDO దాస్ నాయక్, RWS ఏఈ ధనుంజయ, పంచాయతీ సెక్రెటరీ వేణుగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలని సూచించారు.