మార్కాపురం: పొదిలి మండలంలోని పలు గ్రామాలలో పట్ట పగలే ఇండ్లలో చోరీకి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీఐ రాజేష్ కుమార్
మార్కాపురం జిల్లా పొదిలి సర్కిల్ పరిధిలో పలు నేరాలకు పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేసినట్లు సిఐ రాజేష్ కుమార్ తెలిపారు. పొదిలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగరాజు అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించినట్లు తెలిపారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది వెంటాడి పట్టుకొని విచారించినట్లు పేర్కొన్నారు. బుచ్చన్నపాలెం నంది పాలెం చిన్నారి కట్ల గ్రామాలలో పట్టపగలే ఇండ్లలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు.